Difference between pulov and biryani in Telugu


ఈరోజు మనం తెలుసుకుందాము పలావ్ కి ఇంకా బిర్యానీ కి మధ్య తేడా ఏమిటి అని మరియెందుకు 
ఆలస్యం తెలుసుకుందామా 


పలావ్  లేదా పులావ్ 

  • పలావ్ మనం కావలసిన పదార్దాలు అన్ని వేసి అంటే మసాలా దినుసులు, కూరగాయలు లేదా చికెన్ కావాలంటే వేసుకుని బియ్యం కూడా వాటితో పాటుగా ఉడికిస్తారు 
  • అలాగే మసాలా దినుసులు ఎక్కువ ఘాటు గా లేకుండా  ఉండే లా మంచి అరోమా వస్తు ప్లైన్ గ ఉంటుంది 
  • పులావ్ రంగు తెలుపు గా ఉంటుంది బిర్యానీ తో పోలిస్తే ఎందుకంటే మసాలా వలన ,అలాగే పుదీనా శాతం ఎక్కువ గా ఉంటుంది
  • ఇంకా బిర్యానీ కన్నా చేసే విధానం తేలికగా  ఉంటుంది ,పలావ్  దమ్  పెట్టకుండా చేస్తారు

బిర్యానీ 

  • బిర్యానీ కి పలావ్ కి ముఖ్యమైన తేడా ఏమి అంటే బిర్యానీ అంచెలు అంచెలు గా కొంచం ఉడికించిన బియ్యం ఇంకా మసాలా అది కూరగాయలు లేదా మాంసాహారం అవ్వచ్చు ఒక దానిపై ఒకటి అంచె లు  అంచెలు గా వేసి దమ్ పెట్టి చేస్తారు 
  • అలాగే బిర్యానీ లో వేసే మసాలా పలావ్ కన్నా ఘాటుగా ఉండేలా వేస్తాము అంటే లవంగాలు ,జాజికాయ ,జాపత్రి ఇలాంటివి ముఖ్యంగా వేస్తారు 
  • ఇంకా కుంకుమ పువ్వు నానబెట్టిన నీరు  ,బాగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు కూడా వినియోగిస్తారు 
  • ముఖ్యంగా  బిర్యానీ ఆవిరి  బైటకి(దమ్ ) పోకుండా ఉండేలా  వండుతారు
Biryani Rice 

ఇవేనండి నేను తెలుసుకున్న బిర్యానీ కి పలావ్  కి మధ్య ఉన్న తేడాలు,ధన్యవాదములు.  

Comments