ఆంధ్ర స్పెషల్ శనగ పొడి ,ఆహా ఈ పేరు వినగానే నోట్లో నీళ్ళు ఉరతాయి అండి నాకు అయితే ఎందుకు అంటే వేడి వేడి అన్నం లో కాస్తంత నెయ్యి వేసుకుని తింటే వుంటుంది, అద్బుత హ ః ,అంతే కాదండీ ఇడ్లి,దోశ వంటి అల్పాహారం తో పాటుగా కూడా నంచుకుని తిన్నవచ్చు.
కావల్సిన పదార్దాలు
వేయించిన శనగ పప్పు - 100గ్రాములు
ఎండు మిరపకాయలు - 50 గ్రాములు
వెల్లులి రెబ్బలు - 5
ఉప్పు - తగినంత
నూనె - 1/2 స్పూన్
తయారీ
ముందుగా ఒక మూకుడు లేదా కడై తీసుకుని నూనె వేసుకుని ఎండు మిరపకాయలు వేసుకొని వేపుకోవాలి,
మాడి పోకుండా వేపుకుని స్టవ్ కట్టేసి మిరపకాయలు కొంచమ్ చల్లారిన తర్వాత మిక్సి జార్ తీసుకోండి అందులో వేయించి చల్లారిన ఎండు మిరపకాయలు, ఇంకా తగినంత ఉప్పు, వెల్లులి రెబ్బలు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుని ఇప్పుడు వేయించిన శనగ పప్పు లేదా పుట్నలా పప్పు వేసి మిక్సీ పట్టుకోండి గరుకుగ తినేవాళ్లు అయితే అలాగే పట్టుకోండి లేదు అనుకుంటే ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. తర్వాత ఒక కంటైనెర్ లో నిల్వ చేసుకోండి. చూశారా ఎంత తేలిగ్గా చెసుకొవచ్చొ శనగ పొడి.
నోట్:
కారం ఇంకా కావాలి అనుకునే వారు మీ అభిరుచి కి తగినట్తు గా ఎండు మిరపకాయలు పరిమాణం పెంచుకొండి.
నమస్కారం
Comments
Post a Comment