హెల్లొ మిత్రులారా!
మీకు తొందరగా తియ్యగా ఏమైనా తినాలీ అనిపిస్తే వెంటనే ఇంట్లో వున్న బొంబాయి రవ్వ ,పంచదార తో ఇలా కేసరి చేసుకుని తినేయండి, మీ స్వీట్ కారివింగ్ తీరుతుంది.
కావలిసినవి :
బొంబాయి రవ్వ
పంచదార
యాలకులు
నెయ్యి
యాలకులు
జీడిపప్పు, బాధం పప్పు,కిస్మిస్
ఫుడ్ కలర్ - ఎరుపు/పసుపురంగు/నారింజ
తయారీ విధానం
నేను ఒకరికి సరిపోయే కొలత ప్రకారం రాస్తూనాను గమనిచగలరు.
ముందు స్టవ్ వెలిగించి ఒక కడై తీసుకోని అర కప్పు బొంబాయి రవ్వ వేసి దొరగా మాడి పోకుండా వేయించుకుని, ఇప్పుడు కడై లో జీడిపప్పు,బాధమ్ పప్పు, ఇంకా కిస్మిస్ మరియురెండు చెంచాల నెయ్యి(ghee) వేసి ఇవి కూడా మాడి పోకుండా చక్కగా వేయించి పక్కన పెట్టి ఉంచాలి.
మరలా కడై తీసుకుని రవ్వ ఎంత తిసుకున్నమొ అంత కొలత ప్రకారం ,పంచదార తీసుకోవాలి లేదు కొంచెం తీపి ఎక్కవగా
తినేవారు ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్కువ చక్కెర వేసుకుని, కప్పు నీళ్ళుపోసి మూడు దంచిన యాలకులు వేసి, చక్కెర కరిగే వరకూ మరిగించుకుని,పక్కన ఉంచిన రవ్వ వేసి ఉడికించుకొవాలి,ఇపుడు ఒక అర స్పూన్ నూనె లేదా నెయ్యి(ghee) వేసుకోవాలి.
ఉడికిన తర్వాత వేయించి పక్కన ఉన్న డ్రై ఫ్రూప్ట్స్,1/4 స్పూన్ కన్నా తక్కువ ఫుడ్ కలర్ కేసరి లో వేసి, కలియ తిప్పండి. ఇపుడు వడ్దించుకుని రుచి చూసి కామెంట్ చేయండి.🙏🏻



Comments
Post a Comment