నమస్కారం మిత్రులారా
ఇపుడు వర్షాలు బాగా పడుతూ ఉన్నాయ్,దాదాపు ఒక వారం అవుతుంది కదండీ సూర్యుణ్ణి సరిగా చూసి ఇలాంటి వాతావరణం లో ఇపుడు ఉన్న పరిస్థితికి ఇంకొచమ్ ఎక్కువ జాగ్రత్త గా ఉండండి
సరే ఇపుడు నేను ఎలా వేపుకోవాలి అనేది వ్రాయబోతున్నాను ,ఇది చాలా తేలికగా ఐపోతుంది అండి ,దీనిని మీరు మీ భోజనం తో పాటుగా ఒక సైడ్ డిష్ లా పెట్టవచ్చు లేదా టీ తో పాటుగా అందించవచ్చు లేదా మాములు గా కూడా తినవచ్చు .
తయారు చేయు పద్ధతి :
ముందుగా మీరు స్టవ్ వెలిగించుకుని కడై పెట్టుకుని జీడిపప్పు వేయించుకోడానికి సరిపడా నెయ్యి వేసుకుని అది కాగిన వెంటనే మీరు జీడిపప్పు వేసుకొని మాడిపోకుండా వేపుకుంటూ ఇక స్టవ్ ఆఫ్ చేసే ముందు తగినంత పసుపు ,ఉప్పు,కారం వేసుకుని జీడిపప్పు కు పట్టే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని జీడీ పప్పు ను సర్వ్ చేసుకోవడమే, కావాలి అనుకుంటే మీరు కొద్దిగా కరివేపాకు వేయించుకుని సర్వ్ చేసే ముందు గార్నిష్ చేసుకోవచ్చు . నేను కరివేపాకు వెయ్యలేదు అండి ఇది కావాలంటే వేసుకోండి వేయకపోయినా పరవాలేదు ,తప్పకుండా ప్రయత్నించండి ఎలా ఉందొ కామెంట్ చేయండి

Comments
Post a Comment