ఇపుడు నేను రాసే టమాట పచ్చడి కేవలం రోటి పచ్చడి మాత్రమే, నిల్వ పచ్చడి కాదు.ఇది అప్పటికి అప్పుడే చేసుకొనే పచ్చడి ,ఇది అన్నం మరియు ఇడ్లీ,దోశ ఇంకా గారెల తో తినడానికి బావుంటుంది.
టమాటాలు - 4(మీడియ౦ సైజు)
పచ్చి మిరపకాయలు - 8
చింతపండు - చిన్న నిమ్మకాయ అంత
ఉప్పు - తగినంత
నూనె - 3 టేబుల్ స్పూన్లు
వెల్లులి రెబ్బలు - 4
తా లింపు గింజలు - 1 టేబుల్ స్పూన్
ఎండు మిరపకాయలు - 2
కరివేపాకు - ఒక రెబ్బ
తయారీ విధానం
ముందుగా పొయ్యి వెలింగించుకొని ముకుడు పెట్టుకొవాలి, తర్వాత అందులొ తగినంత నూనె వెసుకొని కాగాన్నివాలి ఇపుడు అందులొ ముందుగా పచ్చి మిరపకాయలు వేసుకొని వేపు కొవాలి అవి వేగిన తర్వాత వాటిని వేరె గిన్నె లో తీసుకుని ఉంచాలి, ఇపుడు ఆ కాగిన నూనె లో ముక్కలుగా కోసుకున్న టమాట ముక్కలు మరియు చింతపండు వేసి నూనె లో ముక్కలు గుజ్జు గా అయి నూనె పైకి తేలె వరకు వేపుుుకుని, ఆ టమాట ముక్కలు కొంచెంసేపు చల్లగా ఐన తర్వాత ముందుగా వేయించి తగినంత ఉప్పు,వేలుల్లి రెబ్బలు వేసి కచ్చ పచ్చా గా మిక్సి పట్టుకొని ఇపుడు వేపుకుని ఉంచిన టమాట ఇంకా చింతపండు ను వేసి మొత్తము ఇంకొసారి మీక్సి పట్కొండి అంతే టమాట పచ్చడి రేడి ఐపొఇంది.కొంత మంది తాలింపు పెట్టుకుంటారు అది మీ అభిరుచి ని బట్టీ చేయండి .
నమస్కారం
Note
తాలింపు వేయాలి అనుకునే వారు మాత్రం తాలింపు గింజలు,ఎండు మిరపకాయలు, కరివేపాకు సిద్ధం చేసుకొని
ఉంచుకోండి వద్దు అనుకునే వారు దయచేసి అవి పచ్చడి లో ఉపయోగించ వద్దని మనవి.
గమనిక
వంటకం తయారీ విధానం మరియు కావల్సిన పదార్దాలు మొత్తము చదివిన తర్వాత మాత్రమే చెయ్యడం మొదలు పెట్టండి అని నా సలహా అండి .
Comments
Post a Comment