హలో ఫ్రెండ్స్ ,
మనం ఈ రోజు గోధుమ పిండి తో పూరి ఎలా పొంగెలాగా చెసుకొవచ్చు తెలుసుకుందాము,
ఈ క్రింద తెలిపే కొలత కేవలం ఇద్దరికీ సరిపోతుంది.
![]() |
కావల్సిన పదార్ధాలు |
గోధుమ పిండి - 1 కప్పు
నూనె - వేపు కోవడానికి సరిపడినంత
ఉప్పు - తగినంత
పంచదార - 1/4 చెంచా
తయారీ
ఒక పాత్ర పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండేది తీసుకోండి.
పిండి అందులో తగినంత ఉప్పు, కొంచెం పంచదార వేసి ఒకసారి పిండి లో కలిసెలా కలుపుకొవాలి.
ఇపుడు పిండి లో కొంచెం కొంచెం నీరు పొసుకుంటు పూరీ పిండి కలుపుకొవాలి, చివరిగా ఒక రెండు చుక్కలు నూనె కూడా వేసి పిండి ముద్ద ఒకసారి కలుపుకొవాలి.
ఒక పది నిముషాలు పిండి ముద్ద ప్తె పలుచని క్లాత్ కప్పి ఉంచాలి
ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పూరీ లు వేసుకునెందుకు
ఇప్పుడు పిండి ని చిన్న చిన్న ముద్దలు గా తీసుకోని బిళ్ల లు చేసుకుని గుండ్రంగా చపాతీ కర్రతో వత్తుకొని పూరీ చెయ్యండి.
కాగుతున్న నూనె లో చేసుకున్న పూరీ వేసి వెపుకొండి.ఇంతేనండి పూరీ ప్లేట్ లోకి తీసుకుని కూర తో పాటు గా వడించండి.

Comments
Post a Comment