burnt brinjal recipe in telugu(వంకాయ బజ్జి )

అందరికీ నమస్కారము🙏
ఇప్పుడు మనము కాల్చిన వంకాయ తో ఎలాంటి రుచికరమైన వంట‌కం తయారు చేసుకోవచ్చు అది కూడా చాలా సులువు గా అండీ ఇక మరి తెలుసుకుందమా ,
అరెరె ఇంతకీ వంటకం పేరు చెప్పలేదు కదా?
వంకాయ బజ్జి అండీ  వ్రాయబొయె వంటకం పేరు
హల్లో హాల్లో ఒక నిమిషం హ అని అప్పుడే నిట్టూర్చకండి,
ఇది శనగపిండి తో చేసేది కాదు అండి,ఇక ఆలస్యం చేయకుండా చెప్పెస్తున్నాను

కావలసిన పదార్ధాలు:
వంకాయలు - 4 
చింతపండు - ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత
ఉల్లిపాయ -  1 పెద్దది
ఉప్పు       - తగినంత
కారం       -   1 స్పూన్
పచ్చిమిర్చి - 3
నూనె      - తాలింపు కు తగినంత
పసుపు   -  1/4 స్పూన్
తాలింపు గింజలు - 2 స్పూన్స్
ఎండు మిర్చి - 3 (తాలింపు లోకి)
కరివపాకు- 3 రెబ్బలు

చేసే పద్దతి :
ముందుగా మీరు వంకాయ(పొడుగు,గుత్తి,తెల్లది ఇంకా హైబ్రిడ్ ఏ రకం అయినా తీసుకో వచ్చు) లు స్టవ్ మీద స్టాండ్ పెట్టి లేదా మాములుగా ఐనా తక్కువ సెగ మీద కాల్చుకొవాలి తర్వాత వాటి ని చల్లని నీటిలో ఒక సారి కడిగి వంకాయ మీద కాలిన తొక్కని శుభ్రంగా తీసి ఒక గిన్నె లొ ఉంచి, ఇపుడు ఉల్లిపాయ,పచ్చి మిర్చి సన్నగా తరిగి పెట్టుకొవాలి మరియు చింతపండు నాన పెట్టి ,రసము(కొంచెం చిక్కగా )తీసుకుంటే బాగుంటుంది,
 ఒక పాత్ర తీసుకొని అందులొ తరిగి పెట్టూకున్న ఉల్లిపాయ,పచ్చి మిర్చి ఇంకా చింతపండు రసం 
మరియు ఉప్పు,కారం ఇంకా శుభ్రం చేసిన వంకాయ లు వేసి ఒకసారి అన్ని కలుపుకొని తర్వాత తాలింపూ లేదా పోపు
పెట్టూకోవాలి.
 వంకాయ బజ్జి రెడీ ఇది అన్నం తింటె బాగుంటుంది.


Comments