హెల్లొ మిత్రులారా!
సాయంత్రం పూట టీ తో పాటు ఏమై నా తినాలీ అనిపిస్తే ఒకసారి చట్ని పప్పు లేదా పుట్నాల పప్పు తో ఇలా మిక్చర్ తయారుచేసి తిని చూడండి.
కావలసిన పదార్థాలు
పుట్నాల పప్పు - ఒక కప్పు
ఉల్లిపాయ తరుగు - అర కప్పు
పచ్చిమిర్చి తరుగు - పావు స్పూను
ఉప్పు - తగినంత
కారం - అర స్పూను
నిమ్మరసం - 4 స్పూన్లు
నూనె - పావు స్పూను
టమాటా తరుగు - పావు కప్పు
కొత్తిమీర తరుగు - పావు కప్పు
తయారీ విధానం
ఒక గిన్నెలో పుట్నాల పప్పు,ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు తగినంత ఉప్పు,కారం ,నూనె వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి.
ఇప్పుడు పచ్చిమిర్చి తరుగు ఇంకా కొత్తిమీర తరుగు,నిమ్మరసం వేసి ఇప్పుడు మరల ఇంకోసారి గిన్నెలో మిశ్రమాన్ని అంతా అంటే ఉప్పు ,కారం, నిమ్మరసం అన్నీ కలిసెలా చేతితో లేదా చెంచా తో మంచిగా కలుపుకోవాలి.
ఇంతే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పుట్నాల పప్పుమిక్చర్ రెడీ
గమనిక
మీరు ఇష్ట పడినట్లయితే ఇంకా ఇతర కూరగాయలను కూడా మీరు కలుపుకొని మిక్చర్ చేసుకోవచ్చచు. అంటె కార్యెట్ తరుగు ,బీట్రూట్ తరుగు,కీర దోస ముక్కలు, మామిడితరుగు వంటివి.

Comments
Post a Comment