హెల్లొ మిత్రులారా అందరికీ నమస్కారం
ఇప్పుడు నేను మాగ్గీ నూడుల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ రీతి లో ఏ విధంగా చెయ్యాలో తెలియ చేయబొతున్నాను,చదివెసి ఓసారి తయారు చేసి రుచి బాగుంది లేనిది ఒక్క కామెంట్ చేయండి.
ముందుగా ఒక గిన్నె తీసుకోండి,ఇపుడు ఒక మాగ్గీ నూడుల్స్ తీసుకోండి ,దాన్ని సగానికి విరిచి గిన్నెలో వేసుకొని సరిపడా నీరు పోసుకుని,పావు స్పూన్ నూనె కూడా వేసి, స్టవ్ వెలిగించి నూడుల్స్ ని ఉడక పెట్టండి, నూడుల్స్ సరిపడా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నూడుల్స్ లోని వేడి నీటిని పార బోసి,చల్ల నీరు పోసి నూడుల్స్ కొంచెం చల్ల గా అయిన తరువాత ఆ నీటిని కూడా వడ్పొసి నూడుల్స్ ని ఒక ప్లేట్ లో ఉంచి ,మీ చేతికి నూనె రాసుకుని నూడుల్స్ ని ఒకసారి కలిపి పక్కన ఉంచాలి.
ఇపుడు ఉల్లిపాయ,పచ్చి మిర్చి సన్నగా పొడవుగా తరిగి పెట్టుకొవాలి, ఇంకా కరివేపాకు, కొత్తిమీర తరిగినది,ఉల్లికాడలు మీ ఇష్టం వేసుకున్న లేకున్నా పరవాలేదు,ఒక అర స్పూన్ అల్లం, వెల్లులి పేస్ట్,ఉప్పు,కారం, నూనె ,టొమోటో సాస్,సొయా సాస్,గ్రీన్ చిల్లి సాస్,ఇంకా మాగ్గీ మసాలా ప్యాకెట్ తప్పని సరి ఇది మరిచిపొకాండి,ఇవాన్ని వున్నాయి అని ఓసారి చూసుకోండి.
ఇప్పుడు ఒక కడై తీసుకోని అందులో ఒక స్పూన్ నూనె వేసి కగిన తరువాత కొన్ని కరివేపాకు రెబ్బలు,ఉల్లిపాయ,పచ్చి మిర్చి,వేసి వెపుకొవాలి ,తరువాత కొంచెం పసుపు వేసుకుని కలుపుకొవాలి ,తరువాత అల్లంవెల్లులి ముద్ద వేసి వేపు కోవాలి,ఇప్పుడు ముందుగా ఉడకపెట్టి,చల్లరా పెట్టిన నూడుల్స్ వేసికుని,మీ అభిరుచి తగిన్నత్తు ఉప్పు,కారం వేసుకుని కలపండి,ఇపుడు టొమోటో సాస్ ఒక స్పూన్,చిల్లి సాస్ అర స్పూన్, సొయా సాస్ అరస్పూన్ వేయండి, వేసి బాగా కలియ తిప్పంది ,ఇప్పుడు మాగ్గీ మసాలా పొడి వేసి మళ్ళీ ఓసారి కలపండి ,ఒక రెండు నిమిషాలు కలుపుతూ వేపుకుని స్టవ్ ఆఫ్ చేసి వడ్దించుకుని రుచి చూడండి
గమనిక : ఇక్కడ మీరు కావాలి అనుకుంటే ఇంకా కూరగాయాలు అంటే క్యారెట్,క్యాభెజ్,బీన్స్,ఇంకా కొత్తిమీర,ఇవి కూడా జోడించి చేసుకోవచ్చు.

Comments
Post a Comment