Spicy chicken leg fry recipie recipie in Telugu

 అందరికి నమస్కారమ్

చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఇలా ఒకసారి చేసి చూడండి,హోటల్ రుచి కి ఏ మాత్రం తీసిపోదు, చేస్తారు కదా, మరి ఎలా చేయాలో చూడండి.

కావాల్సిన పదార్థాలు

చికెన్ లెగ్ పీస్  - 2

ఉప్పు     -  తగినంత

కారం      -  1  స్పూన్

చికెన్ మసాలా -1 స్పూన్

నూనె -  వేయించుకునెందుకు సరిపడా

నిమ్మరసం - 2  స్పూన్స్

కొత్తిమీర తరుగు - పావు కప్పు

అల్లం,వెల్లులి ముద్ద - 1 స్పూన్

కార్న్ ఫ్లోర్ - 1 & 1/2 స్పూన్

పెరుగు - 1 స్పూన్

ఫుడ్ కలర్ - పావు స్పూన్

తయారీ

చికెన్ లెగ్ పీస్ లో కొంచెం పసుపు,చిటీకెడు ఉప్పు,పావు స్పూన్ అల్లం,వెల్లులి ముద్ద వేసి నీళ్ళుపోసి అవ్వన్నీ చికెన్ లోనే ఇంకి పోయేలా ఉడికించుకొవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ లో ఉప్పు,కారం,నూనె, కార్న్ ఫ్లోర్, అల్లం,వెల్లులి ముద్ద, నిమ్మరసం, ఫుడ్ కలర్ ,పెరుగు వేసుకుని కలుపుకొవాలి,తరువాత ఈ పేస్ట్ నీ ఉడికించిన ఉంచుకున్న చికెన్ లెగ్ పీసెస్ కి పట్టీంచి పది నిమిషాలు పక్కన ఉంచాలి.

ఇపుడు స్టవ్ వెలిగించి కడై లో వేయించుకునెందుకు సరిపడా నూనె పోసుకుని మంచిగా కాగిన తర్వాత చికెన్ లెగ్ పీసెస్ అందులో వేసి మాడి పోకుండా అటు ఇటు తిపూతూ వేయించి కోవాలి.

మంచిగా వేయించుకున తర్వాత ప్లేట్ లో  సర్వ్ చేసి రుచి చూడండి.

 





Comments