రొయ్యల వేపుడు ఎక్కువ మసాలా లేకుండా సింపుల్ గా ఎలా వండుకొవాలి, తెలుసుకుని ఒక సారి ట్రై చేసి రుచి చూడండి
కావాల్సిన పదార్థాలు
రొయ్యలు -1/2 kg
ఉల్లిపాయ - 2(మీడియం సైజు)
పచ్చిమిర్చి -౩
అల్లం,వెల్లులి ముద్ద-2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - పావు కప్పు తరిగినది
పసుపు - పావు స్పూన్
ఉప్పు- తగినంత
నూనె - అర కప్పు
తయారు చేసే విధానం
ముందుగా శుభ్రం చేసుకుని వున్న రొయ్యల్ని బాగా మరింగించిన నీటిలో వేసి ఒక నిమిషం వుంచి తర్వాత ఒక గిన్నె లోకి స్పూన్ సహాయం తో నీరు లేకుండా తీసుకుని పక్కన ఉంచాలి.
ఇప్పడు ఒక కడై తీసుకుని నూనె పోసి,ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, మిర్చి ముక్కలు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించుకోవాలి,తరువాత రొయ్యల్ని వేసి బాగా అంటే మీరు తినే విధంగా వేపు చూసుకుని రొయ్యలు వెగిన తరువాత అల్లం,వెలూల్లి పేస్ట్ వేసి వెపుతు కొంచెం పసుపు వేసుకుని కలుపుతూ వేపుకోండి
ఇప్పుడు తగినంత ఉప్పు వేసి ఒకసారి కలిపి సెగ తగ్గించి వెగుతూ ఉండగా ఇప్పుడూ కారం కూడా వేసి కలిపి ఒక నిమిషం వెగనించి పొయ్యి మీద నుంచి దింపుకొని,పొయ్యి ఆఫ్ చేసి సెర్వ్ చేసెయ్యండి.

Comments
Post a Comment